English   

వాడు సైకో...కొడుతున్నాడు..వదిలేస్తానెమో..స్వాతి నాయుడు

Swathi Naidu
2020-08-02 17:16:40

నటి స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పోర్న్ స్టార్‌గా గుర్తింపు పొందింది ఆమె. అడల్ట్ మూవీలతో పాటు పలు పోర్న్ చిత్రాల్లో నటించిందనే గుసగుసలు ఉన్నాయి. పొట్టకూటికోసం, సినీ అవకాశాల కోసం అలా నటించాల్సి వస్తోందని ఆమె స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది కూడా. అలాంటి ఈ యూట్యూబ్ సెలెబ్రిటీ గత ఏడాది పెళ్లి చేసుకుంది. సినిమాల్లో నటిగా రాణించాలనే కోరికతో ఇంటి నుండి హైదరాబాద్ కు చేరిన స్వాతి నాయుడు సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమెకు టాలీవుడ్ లో ఛాన్స్ దొరకక బుల్లి తెర మీద ప్రయత్నాలు చేసింది. అక్కడా అవకాశం దక్కలేదు. నటిగా, యాంకర్ గా ప్రయత్నాలు చేసినా కూడా గుర్తింపు రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా సాఫ్ట్ పోర్న్ సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చింది. 

వందల కొద్ది బూతు చిత్రాలు చేసిన స్వాతి నాయుడు అవినాష్ అనే వ్యక్తిని పెళ్ళాడింది. మొన్నీమధ్య పండంటి ఆడపిల్లకు కూడా జన్మనిచ్చారు. బిడ్డను స్వాతి హత్తుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తన భర్త తనను వేధిస్తున్నాడని ఆమె సోషల్ మీడియాలో వీదియోలు పెట్టడం సంచలనంగా మారింది. అయితే అది నిజమైన వీడియోనేనా.. ? లేదంటే ఏదయినా వ్యూస్ కోసం జిమ్మిక్కా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలే లాక్ డౌన్ వలన ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతుంటే భర్త తాగుడుకు బానిసయి రాత్రి కాగానే మందేస్తూ రకరకాల అబద్దాలు చెబుతున్నాడని వీడియోలో చెప్పుకొచ్చింది ఆమె. పాపను కూడా పట్టించుకోవడం లేదని చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటున్నాడని అసలు పెళ్లి చేసుకొని తప్పు చేశానా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. తాగడం వల్ల ఇంత ఇబ్బంది ఉంటుందని తెలియలేదని.. కానీ అతను మాత్రం డ్రింక్ సర్వస్వం అంటున్నాడని చెబుతోంది. ప్రేమించి ఆమె కావాలని చేసుకున్న పెళ్లి ఇలా అవడం ఏమిటని ఆమె అభిమానులు బాధ పడుతున్నారు.

More Related Stories