English   

ఒటీటీ రిలీజ్ కి నిశ్శబ్దం రెడీ...ఎప్పుడంటే 

Anushka Shetty
2020-08-02 17:25:17

అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ షూట్ అంతా రెడీ అయి రిలీజ్‌కి రెడీగా ఉంది. కరోనా దెబ్బ లేకుండా ఉంటే ‘నిశ్శబ్దం’ సినిమా నెలన్నర క్రితమే థియేటర్స్‌లో సందడి చేసేది. ఈ సినిమాని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి అంతా రెడీ కాగా కరోనా దెబ్బకు ఆగింది. నిజానికి గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల రీత్యా వాయిదా పడింది. హేమంత్ దర్శకత్వంలో నిశ్శబ్దం తెరకెక్కింది. ఈ సినిమాలో అనుష్క పాత్రను చాలా ఆసక్తిగా మలిచారు. ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటించగా.. హీరోయిన్లు అంజలి, శాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటుడు మ్యాడిన్సన్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాని కోన ఫిలిం కార్పొరేషన్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై టి.జి.విశ్వ ప్రసాద్ మరియు కోన వెంకట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

‘బాహుబలి’ తరువాత అనుష్క మార్కెట్ పెరిగింది కాబట్టి తాము కూడా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ‘నిశ్శబ్దం’ ను డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదల చేయబోతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని యూనిట్ చెబుతూ ఒస్తోంది. ఎంత చెప్పినా వినకపోవడంతో కోన వెంకట్ థియేటర్‌లో విడుదల చేయడమే మా మొదటి ప్రాధాన్యత ఒకవేళ పరిస్థితులు కనుక అనుకూలించకపోతే అప్పుడు మేము ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అనే విషయం ఆలోచిస్తామని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిర్మాతలు కొన్ని ఓటిటీ ప్లాట్‌ ఫామ్‌ లతో చర్చలు జరుపుతున్నారట. రేట్ ఫైనల్ కాగానే సెప్టెంబర్ లో సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎటూ థియేటర్స్ ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనపడడం లేదు కాబట్టి ఒటీటీ రిలీజ్ తప్పక పోవచ్చు.

More Related Stories