English   

ఎన్టీఆర్ సినిమాకి మళ్ళీ మొదలయిన వేట

Trivikram
2020-08-02 17:31:33

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్నారైగా ఆయన కనిపించబోతున్నాడని ఒకసారి రాజకీయ నాయకుడి కొడుకుగా కనిపించానున్నాడని అంటున్నారు. 

ఈ సినిమాలో పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, మొదటిసారి ఇండియాకి రావాల్సి వస్తుందని అలా రావడానికి కారణం రాజకీయాలు అని అంటున్నారు. ఆ విషయం ఎలా ఉన్నా ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఒకరిని బాలీవుడ్ నుండి తీసుకురావాలని భావిస్తున్న త్రివిక్రమ్ జాన్వీ కపూర్ లేదా కియారా అద్వానీని ఈ సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. చూడాలి చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారో ?

More Related Stories