సాహో డైరెక్టర్ సుజిత్ ఓ ఇంటివాడు అయ్యాడు

2020-08-03 16:28:45
టాలీవుడ్ డైరెక్టర్ సుజిత్ ఓ ఇంటివాడు అయ్యాడు. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవల్లిక అనే యువతితో గత నెలలోనిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వేడుకకు పెద్దగా అతిధులు ఎవరు రాలేదని తెలుస్తోంది. కేవలం సుజిత్, ప్రవళిక లకు సంబంధించిన కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకలో పాల్గొన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు పెళ్లికి హాజరయ్యారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. సుజిత్ సాహో సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచినా.. మెగాస్టార్ చిరంజీవి తను చేయబోయే ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలు సుజిత్ చేతిలో పెట్టాడు.