English   

ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ సెట్ అయిందా 

Nani  maruthi
2020-08-05 08:07:24

నాని- మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ ఎంట‌ర్‌టైనర్ భ‌లే భలే మ‌గాడివోయ్. 2014లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక నానికి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తారని గత ఏడాది నుండి అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే వీరి కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మళ్ళీ మొదలయింది. అంతే కాదండోయ్ త్వర‌లోనే ఈ కాంబో మీద అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా సమాచారం. ప్రస్తుతం నాని తనకి లైఫ్ ఇచ్చిన మోహన కృష్ణ ఇంద్రగంటితో వీ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అంతా పూర్తి అయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అది కూడా కరోనా కారణంగా అది వాయిదా పడింది. 

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. అది కూడా భ‌లే భలే మ‌గాడివోయ్ కి సీక్వెల్ అని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా గత ఏడాది ప్రతి రోజూ పండగే అనే సినిమా చేసిన మారుతి ఆ తరువాత మరే సినిమా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మారుతి నాని సీక్వెల్ కి కధ ఫైనల్ చేస్తున్నదని అంటున్నారు. అయితే ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ఈ సినిమా నాని కోసమే అని ప్రచారం జరుగుతోంది. మతిమరుపు కాన్సెప్ట్ తో అలరించిన నాని - మారుతీల కాంబో మళ్ళీ ఏం మ్యాజిక్ చేయనుందో చూడాలి. ఇక నాని చేతిలో శ్యామ్ సింగ‌రాయ్‌, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు ఉన్నాయి.  

More Related Stories