English   

తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తోన్న తమిళ్ హిట్ డైరెక్టర్ 

 Lokesh Kanagaraj
2020-08-05 10:23:48

ఒకప్పుడు తెలుగులో తమిళ సినిమాలు పెద్ద రిలీజయ్యేవి కాదు. కానీ ఇప్పుడు కనీసం ఐదారుగురు హీరోల సినిమాలు డైరెక్ట్ రిలీజ్ లు అవుతున్నాయి. వాళ్ళలో ఒకటు ఇలయతలపతి విజయ్. విక్రమ్, సూర్య లాంటి వాళ్లే ఇప్పుడు తెలుగులో హిట్ కోసం కష్ట పడుతుంటే విజయ్ మాత్రం అదిరింది, సర్కార్, విజిల్ అంటూ వరస విజయాలు తెలుగులో అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన కార్తీ తో ఖైదీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తో మాస్టర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ లాక్ డౌన్ లేకుంటే ఎప్రిల్ 9నే విడుదల కావాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ అంటూ మాస్టర్ జోరుకు బ్రేకులు పడ్డాయి. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

అయితే ఆ దర్శకుడు ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు మైత్రీ వాళ్ళ దగ్గర లోకేష్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో నటించే హీరో అలానే మిగతా నటీనటులు ఎవరనేది ఇంకా తెలియాల్సివుంది. అయితే కార్తీ ఖైదీ ప్రీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. ఒక వేళ దీనినే మైత్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే తెలుగులో పుష్ప, సర్కారు వారి పాట అనే భారీ చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

More Related Stories