కలర్ ఫోటో టీజర్ టాక్..అమ్మాయిల ముందు బూతులు..

2020-08-05 18:21:04
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కలర్ ఫోటో’ మూవీ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ''నాలాగా నల్లగున్నోడు మీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కనున్న ఫ్రెండ్సే ఎగతాళి చేస్తారు. ఒకడు బ్లాక్ అండ్ వైట్ అంటాడు.. ఒకడు గులాబ్ జామ్ రసగుల్లా అంటాడు. ఒకడేమో ఆశకు హద్దుండాలి.. గు.. సారీ.. అమ్మాయిల ముందు బూతులు మాట్లాడకూడదు'' ''అబ్బాయిల సెలక్షన్ బాగానే ఉంటదిరా కానీ లవ్ సరిగ్గా చేయలేరు.. అమ్మాయిలు లవ్ చేస్తారు కానీ సెలక్షనే..'' అనే డైలాగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందిస్తున్నారు. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి ఛాందినీ చౌదరి నటిస్తుండగా వైవా హర్ష ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ సునీల్ పూర్తి స్థాయి విలన్ గా నటిస్తుండటం విశేషం.