English   

చిరంజీవి పెళ్ళికి తానే కారణమంటున్న హీరోయిన్

Rajasree chiranjeevi
2020-08-06 09:51:17

మెగాస్టార్  చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి కావడానికి తానే కారణం అంటోంది అలనాటి ఓ హీరోయిన్. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనని అంటోంది ఆ హీరోయిన్. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ రాజశ్రీ. ఆమె ఈ మధ్య ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చింది. ఈ సమయంలో సినీ ప్రస్థానంతో పాటు హీరోయిన్‌గా తన కెరీర్ విషయాలు.. పెళ్లి.. కుటుంబానికి సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అంతేకాక చిరంజీవి పెళ్లి కావడానికి నేనే సాయం చేశానని చెప్పుకొచ్చింది. తన చిన్నప్పటి నుంచే అల్లు రామలింగయ్య కుటుంబంతో మా ఫ్యామిలీకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవని, వాళ్లు పిల్లలతో కలిసి తాను చిన్నపుడు ఆడుకునే దాన్నని గుర్తు చేసుకుంది ఆమె. 

ఒకసారి ‘అత్తను దిద్దిన కోడలు’ సినిమా షూటింగ్ సందర్భంగా అల్లు రామలింగయ్య గారు వచ్చి కొత్తగా ఇండస్ట్రీలో ఒక కుర్రాడు వచ్చాడు. చాలా బాగుంటాడు. డాన్సులు, ఫైట్స్ కూడా బాగానే చేస్తున్నాడు. మా అమ్మాయి సురేఖను ఆ అబ్బాయికి ఇద్దామని అనుకుంటున్నా మీరు ఏమంటారని అడిగారని చెప్పుకొచ్చింది. డ్యాన్స్ లు, ఫైట్ లు బాగా చేస్తున్నాడు అంటున్నారు… కచ్చితంగా ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చేసెయ్యండని చెప్పానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ రకంగా అల్లు రామలింగయ్య కూతురు సురేఖ వివాహాం జరిగిందని చెప్పుకొచ్చింది.  

More Related Stories