లోకేష్ సినిమా చరణ్ తోనా, మహేష్ తోనా

గతేడాది ఖైదీ చిత్రంతో కార్తీకి తెలుగు, తమిళ ప్రేక్షకులకు మంచి సినిమా అందించిన దర్శకుడు లోకేష్ ప్రస్తుతం ఈ డైరెక్టర్ స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ లాక్ డౌన్ లేకుంటే ఏప్రిల్ 9నే విడుదల కావాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ అంటూ మాస్టర్ జోరుకు బ్రేకులు పడ్డాయి. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఆ దర్శకుడు ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు మైత్రీ వాళ్ళ దగ్గర లోకేష్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు.
అయితే ఈ సినిమాలో నటించే హీరో అలానే మిగతా నటీనటులు ఎవరనేది ఇంకా తెలియాల్సివుంది. అయితే కార్తీ ఖైదీ ప్రీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. ఒక వేళ దీనినే మైత్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా ? అనే చర్చ జరిగినా అది నిజం కాదని అంటున్నారు. ఎందుకంటే లోకేశ్ తన తర్వాత సినిమాను మహేశ్ బాబుతోకానీ రాంచరణ్ తో కానీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే తెలుగులో పుష్ప, సర్కారు వారి పాట అనే భారీ చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.