English   

అఖిల్ సినిమా ఇక్కడ దెబ్బేసి అక్కడ రచ్చ చేసింది 

 Akhil Akkineni
2020-08-07 09:19:47

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను అనుకున్నంత సక్సెస్ సాధించకపోవడంతో ఆ సినిమా బయ్యర్లకు 9 కోట్ల మేర నష్టాన్ని మిగిల్చిందని అప్పట్లో చాలా రచ్చ జరిగింది. గత ఏడాది జనవరి 25న విడుదలైన మిస్టర్ మజ్ను సినిమాకి  మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది దాంతో పెద్దగా వసూళ్ల ని సాధించలేకపోయింది. ఈ సినిమా యూనిట్ ఆలస్యంగా మేల్కొని, మిస్టర్ మజ్ను ఆడుతున్న థియేటర్లలో పర్యటించింది, కానీ అది అప్పటికే ఆలస్యమైంది. అయితే గుడ్డి కంటే మెల్ల నయం అన్న చందాన ఈ సినిమా 11కోట్ల షేర్ రాబట్టింది దాంతో బయ్యర్లకు 9 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే నిర్మాతకు పెద్దగా నష్టాలు రాలేదు పైగా సినిమాని ముందే అమ్ముకున్నాడు కాబట్టి. ముందుగా అమ్ముకోవడంలో బాగానే గిట్టుబాటు అయ్యింది. కానీ నష్టపోయింది మాత్రం బయ్యర్లే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించింది.  అయితే ఈ మధ్య మన దగ్గర కలెక్షన్లను రాబట్టడంలో విఫలమైన చాలా సినిమాలు హిందీలోకి డబ్ అయి, లక్షల కొద్దీ వ్యూస్ ను సాధిస్తున్న సంగతి తెలిసిందే. అదే కోవలోకి ఈ 'మిస్టర్ మజ్ను' కూడా చేరిపోయింది. తెలుగులో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు యూ ట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఈ సినిమాకు అప్ ‌లోడ్ చేసిన నెలరోజుల వ్యవధిలోనే 100 మిలియన్లు (10 కోట్ల) వ్యూస్ సాధించిందని, 13 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది.  

More Related Stories