నిర్మాతగా మారుతోన్న నిరుద్యోగ నటుడు

సినిమాలు లేక రాజకీయాల్లో కాస్త యాక్టివ్ అయిన నటుడు కృష్ణుడు ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు చెబుతున్నారు. అప్పుడెప్పుడో కూచిపూడి వెంకట్ తెరకెక్కించిన మొదటి సినిమా అనే సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత షాక్, పోకిరి, హ్యాపీ డేస్, యువత లాంటి సినిమాల్లో నటించినా ఎక్కడా పేరు రాలేదు. కానీ ఎప్పుడు అయితే సాయి కిరణ్ అడివి తెరకెక్కించిన వినాయకుడు సినిమాతో మంచి ఫేం వచ్చింది. అయితే ఆ వచ్చిన ఫేం కూడా ఆ ఒక్క సినిమాకే పరిమితం అయిపొయింది.అయితే కొంతకాలంగా సినిమాలు చేయని ఈయన ఈ సారి నిర్మాతగా మారేందుకు సన్నాహాలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ మధ్యనే కృష్ణుడు తన కూతురు పేరు మీద నిత్య క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను లాంఛ్ చేశాడని అంటున్నారు. త్వరలోనే హ్యాపీ డేస్ లాంటి ఒక మచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులకు మంచి సినిమా అందించేందుకు ప్రయత్నిస్తున్నాడనే వార్త హల్చల్ చేస్తోంది. కొత్త నటీనటులతో తీయనున్న ఈ మూవీని జయరామ్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు.