English   

లాక్ డౌన్ ని బాగా వాడుకున్న టాలీవుడ్ హీరో

ravi teja
2020-08-08 12:12:28

సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేయడం నుండి పెద్ద హీరో స్థాయికి ఎదిగాడు హీరో రవితేజ. ఒకప్పుడు రవితేజ సినిమాలంటే మినిమం గ్యారంటీ ఉండేది. కానీ ప్రస్తుతం రవితేజ కెరీర్ ఏమంత బాలేదు. ఈ హీరో నటించిన లాస్ట్ నాలుగు సినిమాలు భారీ డిజాస్టర్ లుగా నిలిచాయి. ఆ నాలుగు సినిమాలలో ఒక్కటి కూడా కనీసం 50 శాతాన్ని మించి రికవర్ చేయలేకపోయిందంటే మనోడి మార్కెట్ ఎలా తయారయిందో అర్ధం చేసుకోవచ్చు. ఎలాగైనా హిట్ కొట్టాలి అనుకుంటూ ఇంకా దండయాత్రలు చేస్తూనే ఉన్నారు రవితేజ. అయితే ఇన్ని ప్లాపులు వస్తున్నా రవితేజకు వరస అవకాశాలు వస్తుండడం విశేషం. 

ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాను చేస్తోన్న రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలు కాకుండా రవితేజ మూడో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. కామెడీ-లవ్ కాన్సెప్ట్ తో సినిమాలు తీసే నక్కిన ఈ సినిమా కోసం బాగానే హోం వర్క్ చేస్తున్నాడు. లాక్ డౌన్ చాలా మందికి న‌ష్టాలు తెచ్చిపెట్టినా ర‌వితేజ‌కు మాత్రం మంచి చేసిందట. వినడానికి వింతఫా ఉన్నా ర‌వితేజ‌‌ లాక్ డౌన్ ఖాళీని త‌న ప‌ర్స‌నాలిటీ షూట్ అయ్యే క‌థ‌ల‌ను అన్వేషించే ప‌నిలో పడ్డాడని అంటున్నారు.
 

More Related Stories