ఎలాంటి సహాయం అడిగినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా ..చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సైబరాబాద్ కమిషనరేట్ లో ప్లాస్మా డోనర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవనిలా పనిచేస్తుందని పేర్కొన్న ఆయన ప్లాస్మా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు, ప్లాస్మా దానంతో చాలా మంది ప్రాణాలు కాపాడినవాళ్లమవుతామని అన్నారు . రియల్ హీరోస్ తో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్న చిరంజీవి మొదటిసారి పోలీసులతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
నేను సినిమాల్లో హీరోగా నటించాను. నిజజీవితంలో హీరోలతో పని చేస్తున్నానని అన్నారు. నిజ జీవితంలో పోలీసులైన ఆ హీరోలతో కలసి పనిచేస్తున్నానని అన్నారు. మొదటిసారి పోలీసులతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని, పోలీసులు ఎలాంటి సహాయం అడిగిన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కరోనా బారినపడి కోలుకున్న వారందరూ ప్లాస్మా దానం చేయాలని, అందరూ ప్లాస్మ దానం చేస్తే కరోనాని తరిమి వేయొచ్చని అన్నారు. అలానే నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండని పిలుపునిచ్చారు.
సినీ కార్మికులకు మూడో దఫా నిత్యవసర త్వరలో పంపిణీ చేయబోతున్నామన్న ఆయన కార్పొరేట్లు, కంపెనీ నుంచి విరాళాలు తీసుకొని సినీ కార్మికుల అదుకోబోతున్నామని అన్నారు. ప్లాస్మా దానం అంటే అపోహలొద్దని ప్లాస్మా పేరుతోటి అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దని అన్నారు. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారని ఆయన అన్నారు.