రాణా వివాహం కోసం ఆ టెక్నాలజీ..అక్కడే ఉన్నట్టే

అదేంటో కానీ మామూలు రోజుల్లో కంటే ఈ లాక్డౌన్ టైంలోనే టాలీవుడ్ లో ఎక్కువ పెళ్ళిళ్ళు అయ్యాయి. అసలు ఊహించను కూడా ఊహించకుండా లాక్ డౌన్ లో తన ప్రేయసి యస్ చెప్పిందని చెప్పి షాక్ ఇచ్చాడు రానా. రానా - మిహీకాల ఫ్యామిలీ ఇటీవల పెళ్ళి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. రేపు వీరి వివాహం జరగనుంది. ముందు ఈ పెళ్లిని స్టేటస్ కు తగ్గట్టే ఫలక్నుమా ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరపనున్నట్టు ప్రచారం జరిగినా ఇప్పుడు మళ్ళీ రామానాయుడు స్టూడియోలోనే ఫైనల్ చేశారు. ప్రస్తుతానికి అయితే పెళ్ళికి 50 మంది మాత్రమే హాజరు కావడానికే ఛాన్స్ ఉంది.
తెలుగు, మార్వాడీ సాంప్రదాయాల్లో ఈ పెళ్లి నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా పెళ్లికి రాలేని ఇండస్ట్రీలోని ఇతర సెలబ్రిటీలు..ఫ్రెండ్స్ కోసం నటుడు రానా వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించనున్నారని అంటున్నారు. ఈ పెళ్లి ఈ టెక్నాలజీలో ఉపయోగించాల్సిన సామాగ్రిని కూడా రానా తను ఎవరినైతే పిలవాలని అనుకున్నారో వారికి పంపారట. వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని కూడా ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇచ్చారట. ఈ వీఆర్ ఎక్విప్మెంట్ను ఉపయోగిస్తే.. మనం కూడా పెళ్లిలో ఉన్నట్లే అనిపిస్తుంది. కాబట్టి రానా ఈ పద్ధతిలో తన పెళ్లి చేసుకుంటున్నాడని అంటున్నారు.