English   

ముంబై లీలావతి ఆస్పత్రిలో చేరిన సంజయ్ దత్..

Sanjay Dutt
2020-08-09 15:31:40

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరాడు.  శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆయన వైద్యులను సంప్రదించాడు. సంజయ్‌కు హుటాహుటిన కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో మనకు నెగెటివ్‌ వచ్చింది. సంజయ్‌ దత్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అనుకోకుండా చిన్న ఆరోగ్య సమస్య తలెత్తడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెంటనే వైద్యులను సంప్రదించాడు సంజయ్. ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలపై కూడా ఫోకస్ చేశాడు. కేజీఎఫ్ 2లో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు సంజయ్ దత్. ఏదేమైనా కూడా సంజుబాబా ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి అభిమానులు హైరానా పడ్డారు.  

More Related Stories