వైభవంగా రానా మిహీక బజాజ్ వివాహం

2020-08-09 09:07:49
గతకొంత కాలంగా ప్రేమిస్తున్న మిహీక బజాజ్ మెడలో శనివారం రాత్రి మూడుముళ్ళు వేశాడు. శనివారం రాత్రి 8.30 నిమిషాలకు వీరి వివాహం జరగ్గా.. ఇరుకుటుంబాల నుంచి కేవలం 30 మంది మాత్రమే బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రానా దగ్గుబాటి కుటుంబం, మిహీకా బజాజ్‌ల కుటుంబాలకు అత్యంత సమీప బంధుమిత్రులు, పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. రానా ఆత్మీయులు నాగచైతన్య, సమంత, సన్నిహితమిత్రులు రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసన కొనిదెల, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే రానాపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ `శాశ్వత లాక్‌డౌన్‌కి ఇదే సరైన దారి` అని సెటైర్లే వేస్తూ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.