మహేష్ ఫ్యాన్స్ బద్దలు కొట్టారుగా రికార్డులు

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజున ఆయన అభిమానులు ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ఉన్న ట్రెండ్స్ రికార్డుల దుమ్ము దులిపారు. నిన్న రాత్రి నుండే #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నిన్న సాయంత్రానికే ట్వీట్ల సంఖ్య 32 మిలియన్లు దాటగా రోజు ముగిసే నాటికి 60.2 మిలియన్ ట్వీట్లతో అతి పెద్ద ట్రెండ్ క్రియేట్ చేశారు. 1.28 లక్షల అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా సరికొత్త రికార్డేనని అంటున్నారు. మహేష్ కు సోషల్ మీడియాలో అద్భుతమైన క్రేజ్ ఉంది.
నిజానికి ప్రతి ఏటా మహేష్ ఫాన్స్ ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపేవారు, ఐతే ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహేష్ భౌతిక వేడుకలు దూరంగా ఉండాలని, గుంపులుగా చేరవద్దని చెప్పడం జరిగింది. అందుకే సోషల్ మీడియాలో మహేష్ బర్త్ డే యాష్ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారీ పాట నుంచి మోషన్ పోస్టర్ ఈ రోజు విడుదలైంది. ఇది కూడా ప్రస్తుతం అన్నింటిలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాకి పరుశురామ్ దర్శకుడు కాగా తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే సూపర్ స్టార్ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నారు.