కాజల్ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అట

కోలీవుడ్ స్టార్ విజయ్ కి అచ్చొచ్చిన హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరని చెప్పచ్చు. ఎందుకంటే వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన తుపాకి, మెర్సల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ మరో మారు జట్టు కట్టి మరో హిట్ కొట్టే ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరో కలిసి మంచి హిట్స్ కొట్టారు.
ఇప్పుడు వీరి గత సినిమాని ఒకదానికి సీక్వెల్ చేస్తున్నారు. తుపాకి సినిమాకి సీక్వెల్ గా రూపొందనున్న ఈ సినిమాలో కూడా విజయ్ కి జోడీగా కాజల్ సందడి చేయనుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కాకపోతే ఈ సినిమాలే ఆమె చేయబోయేది సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ అని అంటున్నారు. అయితే హీరోయిన్ కి ఉన్నంత ప్రాముఖ్యత కాజల్ పాత్రకు కూడా ఉంటుందట. ప్రస్తుతం స్ర్కిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు విషయంలో కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.