బాలీవుడ్ హీరోయిన్‌కు నటాషా సూరికి కోవిడ్ పాజిటివ్

బాలీవుడ్ స్టార్ అమితాబ్ ఫ్యామిలీ కరోనా సోకి వారంతా ఇప్పుడు కరోనాను జయించారు. ఇదే క్రమంలో మరికొందరు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా కరోనా వైరస్ సోకిందట. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి నటాషా సూరికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముఖ్యమైన పని ఉండి ఇటీవలే పూణె వెళ్లి వచ్చాను. ఆ తర్వాత వచ్చిన రెండు, మూడు రోజులకే జ్వరం, జలుబు వచ్చింది. అనుమానం వచ్చి కోవిడ్ టెస్టు చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. వెంటనే నేను హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయాను. ప్రస్తుతం స్వల్పంగా జ్వరం, నీరసంగా ఉందని పోస్ట్‌లో పేర్కొంది నటాషా. కాగా ఈ ముద్దుగుమ్మ బిపాస బసు, కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలో నటించిన డేంజరస్ చిత్రంలో నటించింది. ఆగష్టు 14న ఇది ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది.