రానా తమ్ముడి కార్ కి యాక్సిడెంట్

2020-08-13 09:31:17
రానా తమ్ముడు, శ్రీ రెడ్డి ఇష్యూలో ఫేమస్ అయిన దగ్గుబాటి అభిరామ్ మళ్ళీ హీరోగా లాంచ్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టాడని, త్వరలోనే ఆయన సినిమా పట్టాలెక్కనుందని ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఆయన మరో మారు వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఈ సారి సినిమా వార్తలతో కాదు, లైంగిక వేధింపులతో కాదు, ప్రమాదం కేసులో రాయదుర్గం పోలిస్ స్టేషన్ పరిధిలో మణికొండ లో దగ్గుబాటి అభిరాం కారు స్వల్ప ప్రమాదానికి గురయ్యింది. మణికొండ పంచవటి కాలని సమిపంలో BMW కారులో ప్రయాణిస్తున్న దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే మరో కారును పిలిపించుకున్న అభిరామ్ దానిలో వెళ్ళిపోయారు. ఇక ఈ ఘటనకి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.