రకుల్ రానాలతో టచ్ లో రియా

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ చేసుకుని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో ఆరుగురు వ్యక్తుల మీద సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా అయితే ఆమె సుశాంత్ ని హత్య చేసిందన్నట్టు హైలైట్ చేస్తోంది. ఇదిలా జరుగుతుండగానే రియా కాల్ లిస్ట్ ఇప్పుడు అనేక విషయాలు సంచలనంగా మారాయి. ముంబై పోలీసుల తీరుతో ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయడంతో అనేక విషయాలు బయటపడుతున్నాయి. సుశాంత్ మృతి తరువాత రియా రకుల్ ప్రీత్ సహా, దగ్గుబాటి రానాకు కాల్ చేయడం సంచలనంగా మారింది. ఆమె ఎవరెవరితో మాట్లాడింది ఎన్ని సార్లు మాట్లాడింది అనే విషయాలు బయటకొచ్చాయి
రకుల్ ప్రీత్ సింగ్ : ఈమెకు రియా 30 సార్లు కాల్ చేయగా ఆమె తిరిగి 14 సార్లు చేసినట్టు తెలిసింది.
రానా దగ్గుబాటి : ఏడు సార్లు రానాకు కాల్ చేయగా, రానా నాలుగు సార్లు ఫోన్ చేసినట్టు చెబుతున్నారు.
ఆషికి 2 హీరో సిద్ధార్ధ్ రాయ్ : రియా ఆయనకు 16 సార్లు కాల్ చేయగా తిరిగి 7 సార్లు చేసినట్టు తెలిసింది.
అమీర్ ఖాన్ : రియా ఈయనకు మూడు సార్లు కాల్ చేయగా, తిరిగి ఈయన కొన్ని మెసేజ్ లు పెట్టినట్టు తెలుస్తోంది.