సమంత పాత్రలో ఆ హీరో లవర్

రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడికల్ మూవీలో సమంత కథానాయికగా నటించింది. 80ల నేపధ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా క్రిటిక్స్ ప్రశంసలు పొందడమే కాక చరణ్ లోని నటుడిని బయట పెట్టి బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇక ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రంగస్థలం తమిళ రీమేక్ రైట్స్ లారెన్స్ దక్కించుకోగా, చిత్రంలో ఆయన రామ్ చరణ్ రోల్ పోషించనున్నాడనే ప్రచారం ముందు నుండీ జరుగుతోంది. ఇక తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాని తెరకెక్కించనున్నాడని కూడా అంటున్నారు.
అయితే హీరోగా లారెన్స్ సరే మరి హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలయింది. ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు ఎంత వెయిట్ ఉంటుందో సమంత పాత్రకూ అంతే వెయిట్ ఉంటుంది. ఈ పాత్రను ఈ రీమేక్ లో నిక్కీ గల్రానీ పోషించనుందని తెలిసింది. హీరో ఆది పినిశెట్టితో నిక్కీ గల్రానీ ప్రేమలో వున్న విషయం తెలిసిందే. అదీ కాక ఆది పాత్రను అక్కడ కూడా ఆదినే పోషించనుండడంతో ఆమె సినిమాకి ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారని అంటున్నారు. ఒకవేళ లింగుస్వామి చేయకుంటే బాలా రంగస్థలం రీమేక్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్.