English   

ప్రశాంత్ ఎన్టీఆర్ తో సహా మరో స్టార్ ని లైన్ లో పెట్టాడుగా 

Prashanth Neel
2020-08-13 16:27:45

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్. కే.జి.ఎఫ్ ఏమేరకు సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా కన్నడలోనే కాక తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. కె.జి.ఎఫ్‌ సినిమా జోరుతో కె.జి.ఎఫ్‌- చాప్టర్ 2 కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను ఈ సినిమాలో నటింప చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌ అధీరా పాత్రలో నటిస్తుండటం అలాగే లేడీ ప్రధానమంత్రిగా రవీనా టాండన్‌ నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. కేజీఎఫ్ చాప్టర్ 2ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా. కరోనా బ్రేక్ కారణంగా ఇది వాయిదా పడక తప్పదు. షూటింగ్ పునః ప్రారంభించిన తర్వాతే విడుదల తేదీపై క్లారిటీ వస్తుంది. 

ఇక ఈ సినిమా అటు యష్ కే కాక ప్రశాంత్ నీల్ కు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రశాంత్ నీల్ కి కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలేతో వరుసగా మూడు సినిమాల కమిట్ మెంట్ ఉందని అంటున్నారు. నిన్ను నమ్మి సినిమా తీస్తున్నాం కాబట్టి ఈ సినిమా తరువాత వరుసగా మూడు సినిమాలు తనతోనే చేయాలనీ ఆ నిర్మాత కండిషన్ పెట్టాడట. అలా అదే బ్యానర్ లో కేజీఎఫ్ ఒకటి పూర్తీ కాగా  కేజీఎఫ్ 2తో రెండో సినిమా అవుతుంది, ఈ సినిమా తర్వాత మరో సినిమా ఆ బ్యానర్ లో చేస్తాడట. అయితే ఈ మూవీ ప్రభాస్ తో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ప్రభాస్ కి ఇంతకుముందే ప్రశాంత్ నీల్ కథ చెప్పాడని అంటున్నారు. ఆ తర్వాత పలుమార్లు స్క్రిప్టు గురించి మాట్లాడుకున్నారని అంటున్నారు. ఇప్పటికే ప్రశాంత మైత్రి మూవీ మేకర్స్ తో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయనున్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత ఈ సినిమా ఉంటుందని మైత్రి వాళ్ళు ప్రకటించారు కూడా. అలా తెలుగులో ఈయన రెండు సినిమాలు సెట్ చేసుకున్నాటు చెబుతున్నారు.

More Related Stories