మరో సినిమా ఒప్పుకున్న శ్రుతి హాసన్

కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ తండ్రి బ్రాండ్ వేసుకునే ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ సెపరేట్ ఇమేజ్ సెట్ చేసుకుంది. దాదాపు తెలుగులో అగ్రహీరోలు అందరితోనూ నటించిన ఈ భామ ఆ తర్వాతి కాలంలో సైలెంట్ అయ్యింది. ఇదే సమయంలో విదేశీయుడు అయిన మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం కూడా నడపడంతో వీరిద్దరు త్వరలో పెళ్ళి చేసుకోనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అన్నట్టు వీరి ప్రేమకి బ్రేక్ పడింది. ప్రేమ మత్తులో మునిగి రెండేళ్ళు సినిమాలు చేయకుండా కాలం వృధా చేసుకున్న ఈ భామ గతేడాది వరుస్ హిట్స్ తో ఫాంలో ఉన్న విజయ్ సేతుపతి సరసన నటించేందుకు ఛాన్స్ దక్కించుకుంది.
ఎస్పీ జననథన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా లాభం అనే టైటిల్‌తో తెరకెక్కనుంది. తెలుగులోను ఆమె తన పాత పరిచయాల ద్వారా గోపిచంద్ మలినేని,రవి తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రాక్ లో కూడా నటిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ అయిన “వకీల్ సాబ్ ” లో కూడా శృతి హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే ఇప్పుడు శృతి ఇప్పుడు మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. డిటెక్టివ్ మూవీ ఫేమ్ మిశ్కిన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు కధానాయకుడిగా ఒక తమిళ మూవీ రూపొందుతుంది. ఈ సినిమాలోనే శృతి హాసన్ హీరో శింబు కు జోడీగా ఎంపిక అయ్యారని చెబుతున్నారు. బ్రేకప్ మరచిపోవడానికి ఒప్పుక్కుంటుందో లేక ఖాళీగా ఉండలేక ఒప్పుకుంటుందో కానీ మొత్తానికి బిజీ అయిందన్నమాట.