బాలు లేచిరా.. నీ కోసం చూస్తున్నా.. ఇళయరాజా ఎమోషనల్..

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమించడంతో ఆయన కోసం అంతా ప్రార్థిస్తున్నారు. త్వరగా నయం కావాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఆయన అభిమానులు కూడా బాలు గారు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్యం గురించి ఇప్పుడు ప్రాణ స్నేహితుడు ఇళయరాజా కూడా వీడియో విడుదల చేసాడు. కరోనాతో ఆగస్ట్ 5న బాలు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా కూడా ఉన్నట్లుండి ఆగస్ట్ 13 రాత్రి నుంచి బాలు ఆరోగ్యం విషమించింది. దాంతో అంతా ఒక్కసారిగా ఆందోళన పడుతున్నారు. కరోనా వచ్చిందని తెలియగానే తాను కచ్చితంగా జయిస్తాననే నమ్మకంను వ్యక్తం చేసిన బాలు ప్రస్తుతం అదే పనిలో పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇళయారాజా ఓ భావోగ్వేద వీడియోను షేర్ చేసాడు. బాలు త్వరగా లేచి రా.. నీ కోసం మేము అంతా ఎదురు చూస్తున్నాం.. మన స్నేహం కేవలం సినిమాల వరకే పరిమితం కాదు.. మనం గొడవ పడిన సందర్బాల్లో కూడా ఇద్దరి మద్య స్నేహం కొనసాగిందనే విషయం గుర్తించుకో.. మనిద్దరి మద్య మాటలు లేని సమయంలో కూడా మన స్నేహం చెక్కు చెదరలేదని తెలుసుకో.. ఎల్లప్పుడు మనం స్నేహితులుగానే ఉన్నాం.. ఉంటాం కూడా.. నువ్వు బాగుంటావని నీ ఆరోగ్యం త్వరలోనే కుదుట పడుతుందని.. నీవు త్వరలోనే నన్ను కలుసుకుంటావని నా మనసు చెప్తుంది అంటూ ఇళయరాజా ఎమోషనల్ అయ్యాడు.