జగన్ గారూ.. మీ ఇమేజ్ నాశనం చేస్తున్నారు కాస్త చూస్కోండి..

ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. హీరో రామ్. ఇన్ని రోజులు రామ్ అంటే ఇన్ని రోజులు కేవలం సినిమాలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఈయన చేసిన కొన్ని ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఈయన కొన్ని సంచలన ట్వీట్స్ చేసాడు. మొన్న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై హీరో రామ్ స్పందించాడు ఇప్పుడు. అగ్ని ప్రమాదానికి రమేష్ హాస్పిటల్‌ను బాధ్యుల్ని చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించాడు. రమేష్ హాస్పిటల్‌కు ముందు స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వమే క్వారంటైన్ సెంటర్ నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేసాడు. ఒకవేళ అప్పుడే ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరు తీసుకునే వాళ్లు అని ప్రశ్నించాడు. ప్రభుత్వం కోరితేనే స్వర్ణ ప్యాలెస్ సెంటర్లో రమేష్ హాస్పిటల్ క్వారంటైన్ సెంటర్‌ను నడిపిందని ఆయన ఇవాళ ట్వీట్ చేసాడు. అదే స్వర్ణ ప్యాలెస్‌లో మూడు వారాల ముందు ప్రమాదం జరిగి ఉంటే ఎవర్ని నిందించే వాళ్లు.. ప్రభుత్వం కాదా అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతేకాదు.. ఫీజు ప్లస్ ఫైర్ ఈక్వల్ టూ ఫూల్స్ అంటూ చెప్పుకొచ్చాడు రామ్. ఈయన చేసిన ట్వీట్స్ ఓ సారి చూద్దాం..
‘పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagangaru.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం’ ‘ఫైర్ + ఫీజు = ఫూల్స్.. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా? ఫీజుల వివరణ: మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. ’ ‘హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?’ ఈ ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.