English   

బాలసుబ్రమణ్యం భార్యకు కూడా కరోనా పాజిటివ్

SP Balasubrahmanyam
2020-08-16 14:53:00

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో క‌రోనా వైర‌స్ ప్రకంప‌న‌లు మామూలుగా లేవు. రోజూ ఎవరో ఒకరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనా సోకినా ప్ర‌ముఖ సింగ‌ర్ ఎస్పీ బాల సుబ్ర‌మ‌ణ్యం క‌రోనా బారిన ప‌డి వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింద‌ని, చెన్నై ఎంజీఎం ఆసుప‌త్రి బులిటెన్ విడుద‌ల చేయ‌టంతో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయ‌న ఆరోగ్యం మెరుగ‌వుతోంద‌ని ఆయ‌న కొడుకు చ‌ర‌ణ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో కాస్త ఊరటనిచ్చే అంశం.  

అయితే తాజాగా బాలు గారి సతీమణి సావిత్రి కూడా కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. బాలుకు కరోనా పాజిటివ్ రాగానే ఆయన కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టులలో ఆయన సతీమణి సావిత్రికి కూడా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమెను కూడా చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారని చెబుతున్నారు. బాలు తనకు పాజిటివ్ అని నిర్ధారణ కాగానే వీడియో ద్వారా అభిమానులకు సమాచారం అందించారు. 

More Related Stories