English   

ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేసిన అల్లు అరవింద్

Allu Aravind
2020-08-16 15:00:27

దాదాపు ఏడాది క్రితం నిర్మాత అల్లు అరవింద్ ఒక పాన్ ఇండియా ప్రాజెక్టును రూ .300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించాలని యోచిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీదనే కొన్ని రోజుల క్రితం గట్టిగా ప్రచారం జరిగింది. దీనిలో ఎన్టీఆర్, మహేష్ బాబులు కలిసి నటిస్తున్నారని, ఈ ఇద్దరూ కలిసి చేస్తోన్న సినిమా బంపర్ హిట్ కొట్టనుందని ప్రచారాలు గట్టిగా సాగాయి. అయితే ఆయన ఇప్పుడు అదేమీ కాదని షాకిచ్చాడు. ఎందుకంటే తాను పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నానని ప్రకటించి అది నేరుగా ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల అవుతుందని పేర్కొన్నారు. ఈయనకు సంబందించిన ఆహా వీడియో యాప్ లో తాజగా విడుదలైన జోహార్ మరియు మెట్రో కథలు టీమ్ లతో ముచ్చటిస్తూ ఈ విషయాలని వెల్లడించారు. 

ఇప్పుడు నేను పేరు, మరిన్ని వివరాలను వెల్లడించలేను, కానీ నేను నిర్మించే ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సిద్ధంగా ఉన్నాడని అన్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌లో నిర్మించబడుతుందని చెప్పుకొచ్చాడు ఆయన. ఈ ప్రాజెక్ట్ ఆహా వీడియోలో విడుదల అవుతుందా లేదా అనేది కూడా ఆయన పేర్కొన లేదు. ఇక ప్రభుత్వ మార్గదర్శకాలను బట్టి ఈ చిత్రాల షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న  ఆయన ప్రేక్షకులు ఎప్పుడూ థియేటర్లలో మాత్రమే సినిమాలు చూడాలని కోరుకుంటారని, అదే సమయంలో, ఓటిటి ప్లాట్‌ఫాంలు కూడా తమ ఫాం తాము నిరూపించుకుంటాయని అన్నారు.  

More Related Stories