English   

జక్కన్నతో మహేష్ సినిమా ఇప్పట్లో లేనట్టే 

Rajamouli
2020-08-17 11:48:58

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో హియ్ కొట్టిన మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా అనౌన్స్ చేశారు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళితో సినిమా చేయనున్నారు. ప్రముఖ నిర్మాత కె. ఎల్. నారాయణ తన దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో తీయనున్న ఈ సినిమా మీద టాలీవుడ్ సహా పలు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాలేదు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తీస్తున్నారు రాజమౌళి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఆ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పట్లో పూర్తి అయ్యేట్టు కనిపించడం లేదు. అందుకే ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమా అంటే లేట్ అయ్యేట్టు కనిపిస్తోందని భావిస్తున్న మహేష్ ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టినట్టు చెబుతున్నారు. వంశీ పైడిపల్లి సహా సందీప్ రెడ్డి వంగాతో సినిమాతో పాటు మరో సినిమా కూడా తెరకెక్కించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. 

More Related Stories