English   

వామ్మో త్రివిక్రమ్ ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టాడా

Trivikram
2020-08-17 12:00:17

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా ఉంబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అంతా బాగుంటే ఈ పాటికి సెట్స్ మీదకి వెళ్లి ఉండేది. అయితే కరోనా దెబ్బకు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ? ఎప్పటికి పూర్తి అవుతుందో ? ఎప్పటికి రిలీజ్ అవుతుందో ? తెలియని పరిస్థితి. అయితే అందరు దర్శకుల లానే ఈయన కూడా టైం వెస్ట్ చేసుకోకుండా సినిమాలను లైన్ లో పెడుతున్నాడట. ఎన్టీఆర్ సినిమా తరువాత ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీయనున్నారని అంటున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ కూడా రెడీ చేసుకున్నట్టు చెబుతున్నారు. అలానే మహేష్ కోసం కూడా ఒక మంచి కధ రెడీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయాలని ఆయన భావిస్తున్నాడని అంటున్నారు. అంతే కాదు మెగాస్టార్, పవర్ స్టార్ లతో ఒక మల్టీ స్టారర్ కూడా ఈయన ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత మాత్రం నిజాలు ఉన్నాయో తెలీదు కానీ, ఈ లైనప్ నిజం అయితే గనుక ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం అని చెప్పచ్చు.

More Related Stories