English   

ఆమే కావాలంటున్న మహేష్...అందుకేనా ?

 Mahesh Babu
2020-08-17 16:01:10

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది కూడా. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందని వార్తలు వస్తున్నా ఆ విషయం మీద అయితే క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించే పాత్ర ఇదేనంటూ ఒక ప్రచారం గట్టిగా జరుగుతోంది. అదేంటంటే ఈ సినిమాలో కీర్తి బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించనుందని సమాచారం. ఇక మహేష్‌ బాబు తల్లి బ్యాంకు అధికారిగా పనిచేస్తుందట. ఆమె కింద బ్యాంకు ఉద్యోగిగా కీర్తి సురేష్‌ నటించనుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

అయితే అందరు హీరోలు ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తోంటే తాను కూడా వాటి మీద ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు మహేష్ సన్నిహితులు. అందుకే ఈ సినిమాలో మరిన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. తమిళ్ లో ఇప్పటికే స్పైడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి తమిళ్ వాళ్ళని ఆకట్ట్టుకోడానికి ఈ సినిమాలో ఎలా అయినా నయనతార చేత నటింపచేయాలని చూస్తున్నారట. అయితే అది హీరోయిన్ రోల్ కోసం కాదని, మరో పాత్ర ఏదయినా సృస్టించడానికి కూడా వెనకాడ వద్దని మహేష్ దర్శకుడితో చెప్పినటుగా ప్రచారం జరుగుతోంది.  

More Related Stories