రెమ్యునరేషన్ తగ్గించుకున్న విజయ్...

నటుడు విజయ్ కార్తితో ఖైదీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మాస్టర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ లాక్ డౌన్ యవ్వారం లేకుంటే ఏప్రిల్ 9నే విడుదల కావాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ అంటూ మాస్టర్ జోరుకు బ్రేకులు పడ్డాయి. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విజయ్ తన తర్వాత సినిమాకి రెడీ అయ్యారు. ఈయన మరో సారి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యాడు. అయితే కరోనా కారణంగా సినిమా వాళ్ళు అందరూ పారితోషకం తగ్గించుకోవాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
అయితే ఈ నేపధ్యంలో విజయ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్లకూ సన్ పిక్చర్స్ సంస్థ రేమ్యునరేషన్ తగ్గించుకోమన్నట్టు అందుకు వారు ముందుకు ఒప్పుకోక పోవడంతో ఈ కాంబినేషన్ సినిమా ఆగిందని అన్నారు. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు విజయ్ 70 కోట్లు పారితోషికం తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. అంతకు ముందు 80 కోట్లు అనుకోగా ఇప్పుడు పది తగ్గించుకుని చేయడానికి రెడీ అయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.