English   

హీరో సిద్దార్థ్ ఏమైపోయాడు 

 Siddharth
2020-08-19 15:20:55

హీరోగా సిద్దార్థ్ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తమిళ బేస్ హీరో అయినా ఈయనకు టాలీవుడ్ లో కూడా అభిమానులు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకి తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చేసిన ఒకటీ అరా ఆయనకు సరయిన సంతృప్తి ఇవ్వకపోవడంతో తమిళంలోలో ఎలాగోలా కెరియర్ ను నెట్టుకొస్తున్నాడు. వదలడు తమిళ రీమేక్ సినిమా హిట్ తర్వాత మరో సినిమా ఈయన చేయలేదు. మరి ఈ హీరో తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తాడా ? అంటే చెప్పలేని పరిస్థితి. హీరో సిద్దార్థ టాలీవుడ్ కెరీర్ ముగిసిపోయిందని అందరూ భావిస్తూ వచ్చారు. 

కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్న సిద్దూ, ఆ తరువాత అన్నీ పరాజయాలను మూటగట్టుకున్నాడు. ఈ కారణంగా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో, తమిళంలోనే తాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. అలాంటి సిద్ధార్థ్  తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు.  "ఎవడేమన్నా నేను తిరిగి వస్తానులే. నా ప్రామిస్ ను గుర్తుపెట్టుకోండి,మంచి కంటెంట్ ను సిద్ధం చేశాను నాకు 18 నెలల సమయం ఇవ్వండి మిమ్మల్ని అలరించడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను. నేను ఆన్ ది వే .. మాట్లాడుకుందాం" అంటూ ఆ మధ్య ట్వీట్ చేశాడు. ఆ మ‌ధ్య `వదలడు` అనే సినిమాతో సిద్దూ లైన్ లోకి వ‌చ్చిన‌ట్లేన‌ని భావించినా అది హార‌ర్ సినిమా కావ‌డంతో అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం త‌మిళ్ లో భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు.  

More Related Stories