ఆగిన పవన్ క్రిష్ సినిమా...క్లారిటీ ఇచ్చిన క్రిష్

పవర్ స్టార్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఓ మూవీ తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీరియాడిక్ మూవీగా తెరక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి లాక్ డౌన్ కి ముందే దర్శకుడు క్రిష్ కొంత మేర షూటింగ్ జరిపారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని ప్రచారం జరుగుతోన్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించి ముందు నుండీ విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజగా ఈ సినిమా టైటిల్ అంటూ మరో పేరు ప్రచారంలోకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్న ఈ సినిమాకి వీర అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని టీం భావిస్తుందని అంటున్నారు. పవన్ కూడా ఈ టైటిల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాని ప్రస్తుతానికి ఆపినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే ఈయన మరో సినిమా ఒప్పుకున్నాడని అన్నారు. అయితే ఈ సినిమా ఆగిందంటూ వచ్చిన వార్తలకు క్రిష్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా అగదని అన్నారు. ఈ సినిమా కోసం పవన్ బల్క్ గా కాల్షీట్లు ఇచ్చారని, అయితే ప్రస్తుతం కొంత గ్యాప్ రావడంతోనే తాను వైష్ణవ్ తేజ్ తో జంగిల్ బుక్ సినిమా తీస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.