English   

షూట్ కి రెడీ అవుతోన్న రాధే శ్యామ్ 

Prabhas
2020-08-20 18:21:16

సాహో తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ జిల్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు జాన్ అని లేదు రాధే శ్యాం అని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఎట్టకేలకి ఈ సినిమా పేరును యూనిట్ ఫైనల్ చేసింది. ముందు నుండి ప్రచారం జరిగినట్టుగానే రాధే శ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలానే పూజ హేగ్దే - ప్రభాస్ లు కౌగులించుకుని ఉన్న ఫస్ట్ లుక్ ని కూడా యూనిట్ రిలీజ్ చేసింది. వైట్ కోట్ లో ప్రభాస్, ఎర్రటి గౌన్ లో పూజా, ఇద్దరూ కౌగలించుకుని కొత్త అనుమానాలు రేకెత్తించేలా ఉన్నారు.  పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా ఇటలీ, జార్జియాలలో చేశారు. 

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో హైదరాబాద్‌ లోనే అక్కడి సెట్స్‌ నిర్మిస్తున్నారు.  అయితే ఈ సినిమా షూట్ త్వరలోనే మొదలు కానున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ షూట్ అక్టోబర్ నెల మధ్యలో మొదలయ్యి డిసెంబర్ వరకు రెగ్యులర్ గా జరగనున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ షూట్ ఇక్కడే జరగనుందని కొంత మంది చెబుతున్నా, ఎక్కడ జరగనుందనేది తెలియాల్సి ఉంది.  ఈ సినిమాలో ప్రభాస్‌ జోతిష్కుడిగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. బాహుబలి, సాహో లాంటి పాన్ ఇండియా సినిమాల తరువాత ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

More Related Stories