English   

అఖిల్ తో అంత రిస్క్ ఎందుకు బాసూ 

 Surender Reddy
2020-08-20 18:32:39

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా తన తరువాతి సినిమాని ప్రకటించలేదు. అయితే త్వరలో సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఈయన అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడని అన్నారు. దాని మీద అయితే ఇంకా క్లారిటీ లేదు.

తాజాగా ఆయన హీరో రామ్ తో ఒక సినిమా కమిట్ అయినట్టు చెబుతున్నారు. రెడ్ మూవీ అనంతరం రామ్ సురేందర్ రెడ్డి సినిమాలో జాయిన్ అవుతాడని ప్రచారం జరిగింది. అయితే ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన రామ్ ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేసేలా సురేందర్ రెడ్డి రామ్ కోసం ఓ కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేశారని అంటున్నారు. అది ఇంకా ఖరారు కాక ముందే ఈయన అక్కినేని అఖిల్ తో సినిమా ఫైనల్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. అయితే అఖిల్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఈ సినిమాకి నిర్మాత దొరకడం కాస్త కష్టంగా ఉందని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే సురేందర్ రెడ్డి ఈ సినిమాని భారీ బడ్జెట్ లో ప్లాన్ చేయడమే. ఏకంగా అఖిల్ తో సినిమాని 40 కోట్లకు పైగానే ప్లాన్ చేశారట. అఖిల్ కి అంత మార్కెట్ లేకపోవడంతో ఎవరూ దొరకకపోతే అన్నపూర్ణ బ్యానర్ మీదనే తెరక్కించే అవకశాలు ఉన్నాయని అంటున్నారు.

More Related Stories