English   

ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వండ్రా బాబూ 

Radhe Shyam
2020-08-20 20:06:24

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అత్యంత క్రేజ్‌ ఉన్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అంటే అతిశయోక్తి కాదేమో. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ బాహుబలి సిరీస్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం అది నిలవకేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వింటేజ్ స్టైల్‌ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది. ఈ ఏడాది చివరలో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నా రాధే శ్యామ్ పూర్తి కావడం మీదే ఇది ఆధార పడి ఉంది. 

నిజానికి ఈ సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అక్టోబర్ లో షూట్ కి వెళ్తారని అంటున్నా మొదలయ్యేదాకా నమ్మలేము. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ కీలక అంశం మాత్రం సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండీ ఇప్పటి దాకా సస్పెన్స్ గా ఉంది. ఈ సినిమాకి సంబంధించి అన్ని విషయాలు చెప్పేసిన టీమ్ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రమే క్లారిటీ ఏదన్నది చెప్పలేదు. అసలు ఇప్పటిదాకా ఎవరినీ ఫైనల్ చేయలేదా ? లేక ప్రమోషన్స్ కోసం పేరు అనౌన్స్ చేయలేదా ? అనే సంగతి తెలీదు. కానీ అందుతున్న సమాచారం మేరకు, సాహోకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చిన జిబ్రాన్ ను ఈ సినిమాకి ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా వెల్లడించకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వండ్రా బాబూ అంటూ సోషల్ మీడియాలో సెటైర్ లు వేస్తున్నారు.  

More Related Stories