English   

బన్నీతో చిందేయడానికి ప్రభాస్ భామ 

Shraddha Kapoor
2020-08-20 20:48:59

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ‌న్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌ గా కనిపించనున్నాడని పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయ‌నున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేప‌థ్యంలో సౌత్‌, నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్రముఖుల‌ని ఎంపిక చేశారు. ఈ సినిమా నుండి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తప్పుకున్నారని ఆయన ప్లేస్ లో బాబీ సింహాని తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాల మీద ఎక్కడా అధికారిక కన్ఫర్మేషన్ అయితే లేదు. 

రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని గ్యాప్ లేకుండా షూట్ చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే సుకుమార్ సినిమా అంటేనే ఐటెం సాంగ్స్ కి పెట్టింది పేరు అలాంటిది ఈ సరి ఎవరి చేత చిందు వేయిస్తాడా ? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రకరకాల పేర్లు వినిపించాయి, తాజాగా మరో పేరు లైన్ లోకి వచ్చింది. ఈ పాట కోసం సుకుమార్ అండ్ టీం బాలీవుడ్ భామ శ్ర‌ద్దాక‌పూర్ ను సంప్ర‌దించిందని, అందుకు ఆమె ఒప్పుకుందని కూడా అంటున్నారు. అయితే నిజంగా శ్ర‌ద్దాక‌పూర్ ఈ సాంగ్ కోసం ఒప్పుకుందా లేదా ? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వ్యవహరిస్తున్నారు.  
 

More Related Stories