English   

రొమాంటిక్ లో సిమ్రన్...అందుకే దాచారట 

Simran Akash Puri  
2020-08-23 10:04:54

దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రొమాంటిక్’. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరీ జగన్నాథ్ అందిస్తున్నారు. అనిల్ పాడూరి అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన ఆరంగ్రేటం చేస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న రొమాంటిక్ ఇప్పటికే హైదరాబాద్‌, గోవాలలో కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అలనాటి రొమాంటిక్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అన్నట్టుగానే ఆమె షూట్ లో కూడా పాల్గొంది.

 అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తోందని అంటున్నారు. ఆమె మరెవరో కాదు, సిమ్రాన్. అయితే కావాలనే ఈ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారని అంటున్నారు. ఈ సినిమాలో సిమ్రాన్ కేతిక శర్మకి తల్లిగా నటిస్తోందని అంటే ఆకాష్ పూరికి సిమ్రాన్ అత్తగా కనిపించబోతుందని అంటున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ లవ్ స్టోరీతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తుందా ? అనేది చూడాలి.

More Related Stories