English   

క్రిష్ అందుకే మరో సినిమా ఒప్పుకున్నాడా 

Krish and Vaishnav Tej
2020-08-23 17:28:17

పవర్ స్టార్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఓ మూవీ తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీరియాడిక్ మూవీగా తెరక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి లాక్ డౌన్ కి ముందే దర్శకుడు క్రిష్ కొంత మేర షూటింగ్ జరిపారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని ప్రచారం జరుగుతోన్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి ముందు నుండీ విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజగా ఈ సినిమా టైటిల్ అంటూ మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బందిపోటుగా క‌నిపించ‌నున్న ఈ సినిమాకి వీర అనే టైటిల్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని టీం భావిస్తుంద‌ని అంటున్నారు. ప‌వ‌న్ కూడా ఈ టైటిల్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాని ప్రస్తుతానికి ఆపినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే ఈయన మరో సినిమా ఒప్పుకున్నాడని అన్నారు. అయితే తన సినిమా కోసం పవన్ బల్క్ గా కాల్షీట్లు ఇచ్చారని, అయితే ప్రస్తుతం కొంత గ్యాప్ రావడంతోనే తాను వైష్ణవ్ తేజ్ తో జంగిల్ బుక్ సినిమా తీస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంటే పవన్ సినిమా కంటే ముందే ఈయన మరో సినిమా చేస్తాడట. పవన్ ముందుగా వకీల్ సాబ్ పూర్తి చేశాకనే మీ సంగతి చూస్తానని చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. 

More Related Stories