English   

మహేష్ ఆ డైరెక్టర్ ని ఓకే చేశాడా 

Mahesh Babu
2020-08-23 18:25:14

తెలుగు డైరెక్టర్ కాకపోయినా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన తీసిన మొదటి సినిమానే సూపర్ కాదు బంపర్ హిట్ కావడంతో మన తెలుగు హీరోల అభిమానులు మా వాడితో కూడా ఒక సినిమా చేస్తే బాగుండు అనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. అవును ఆయనే ప్రశాంత్ నీల్. కన్నడ కేజీఎఫ్ ని తెరకెక్కించిన దర్శకుడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఈ కన్నడ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. 

ఈ మొదటి భాగం హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడని మైత్రీ వాళ్ళు ప్రకటించారు. అది అఫీషియల్ కాకున్నా జరిగే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఇక మరో పక్క ఈయన మహేష్ కి ఒక కధ చెప్పినట్టు చెబుతున్నారు. మహేష్ కూడా ఆ స్టోరీ విషయంలో అంతే సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మరి నీల్ నిజంగానే మహేష్ తో ప్రాజెక్టు చేస్తున్నారో లేదో కానీ ఈ కాంబోలో కూడా ఒక సినిమా సెట్ అయితే మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనే చెప్పాలి.

More Related Stories