English   

బన్నీ కొరటాల సినిమా రిలీజ్ అప్పుడేనా 

Koratala Siva
2020-08-24 16:35:14

అల్లు అర్జున్ వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. నా పేరు సూర్య ఫ్లాప్ ర్వాత బన్నీ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంమే కాక, టాప్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తోన్న బన్నీ ఆ తర్వాత కొరటాల శివతో ఒక సినిమా కమిట్ అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ 21వ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ప్రారంభం అయ్యిందని అంటున్నారు. ప్యాన్ ఇండియా ఎవల్ లో తెరకెక్కనున్న ఈ సినిమా నటీనటుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ ని కూడా ఈ సినిమాలో నటింపజేయాలనుకుంటున్నారట. కీలక పాత్రధారులతో పాటు విలన్ కూడా బాలీవుడ్ నటుడే ఉండనున్నారట. 

ఈ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు భావిస్తున్నారు. హీరోయిన్ ని కూడా బాలీవుడ్ నుంచే అనుకుంటున్నారు. ఇక ప్రస్తతం కొరటాల మెగాస్టార్‌తో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ‘పుష్ప’ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించవచ్చని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సినిమాను ప్రారంభించి 2022 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు చెబుతున్నారు.  

More Related Stories