English   

సూర్య సినిమా రిజల్ట్ చూశాక...ఆ సినిమా మీద క్లారిటీ 

Suriyas Soorarai Pottru
2020-08-24 16:46:13

కరోనా వల్ల ప్రపంచమే స్థంబించింది. ఇక సినిమాలు ఒక లెక్కా, సినిమా థియేటర్లు సహా షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడైతే షూటింగ్స్ కి అనుమతి ఇచ్చారు. అయినా చిన్న చిన్న సినిమా యూనిట్స్ తప్ప ఎవరూ సినిమాలు చేయడానికి సిద్దంగా లేరు. థియేటర్స్ అయితే ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. థియేటర్స్ లేకుంటే రిలీజ్ లు కూడా ఉండవు కదా. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఆ దెబ్బకి ఈ రెండు-మూడు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా పడినట్టే. ఈ లాక్ డౌన్ ఎప్పటి దాక ఉంటుందో తేలేదు. దీంతో థియేటర్స్ లో కొత్త సినిమాలను చూసే అవకాశం ఇప్పట్లో లేనట్టే. అందుకే ఇన్ని రోజులు ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపించని పెద్ద హీరోలు సైతం ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నారు. 

ఇప్పటికే తెలుగులో నాని 'వి' సినిమా విడుదల, చేయనున్నట్టు ప్రకటించాడు. తమిళ హీరో సూర్య కూడా తన ఆకాశమే నీహద్దురా సినిమాని ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు. దీంతో ఇప్పుడు తమిళ స్టార్ హీరోలు మరికొందరు ఓటీటీ వైపు ఆసక్తి చూపించనున్నారని అంటున్నారు. సూర్య సినిమా రిలీజ్ అయ్యాక చిత్రం తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఎలాంటి స్పందన వస్తుందనే విషయాన్ని సూర్య సినిమా విడుదల అయ్యాక చూసి ఆ తర్వాత విజయ్ నటిస్తున్న 'మాస్టర్' సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  

More Related Stories