English   

ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడు పోయిన సత్య దేవ్ సినిమా ఆడియో రైట్స్ 

 Satyadev Tamannaah
2020-08-24 17:02:03

తెలుగులో వేరే బాషల సినిమాలు రీమేక్ చేయడం కొత్త ఏమీ కాదు. ఇక టాలీవుడ్‌ లో అయితే ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. ఇక తాజాగా హీరో సత్యదేవ్ హీరోగా క్రేజీ సినిమా తెలుగులోకి రీమేక్ అవుతోంది. కన్నడ హిట్ మూవీ అయిన లవ్ మోక్టైల్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. తమన్నా సత్యదేవ్ కి జంటగా నటించనుందని అంటున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాని కన్నడ దర్శకుడు నాగ శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. 

ఇక ఈ సినిమాకి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాల భైరవ సంగీతం అందించానున్న ఈ సినిమా ఆడియో రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడు పోయాయట. ఈ సినిమా ఆడియో రైట్స్ ని ఆనంద్ ఆడియో సంస్థ ఏకంగా 75 లక్షలకి దక్కించుకుంది. ఇక ఈ సినిమాని దర్శకుడే నిర్మిస్తుండడం గమనార్హం. ఇక ఇటీవల సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. కేర్ ఆఫ్ కంచర పాలెం ఫేమ్ మహా వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కిన్న ఈ మూవీ మలయాళ హిట్ చిత్రం మహేశింటే ప్రతీకారంకి తెలుగు రీమేక్. ఈ సినిమాకి సత్య దేవ్ నటనకు మంచి పేరు వచ్చింది. 

More Related Stories