English   

రానా పెళ్ళికి రాని వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ లు 

Suresh Babu
2020-08-25 17:50:17

అదేంటో కానీ మామూలు రోజుల్లో కంటే ఈ లాక్‌డౌన్ టైంలోనే టాలీవుడ్ లో ఎక్కువ పెళ్ళిళ్ళు అయ్యాయి. అసలు ఊహించను కూడా ఊహించకుండా లాక్ డౌన్ లో తన ప్రేయసి యస్ చెప్పిందని చెప్పి షాక్ ఇచ్చాడు రానా. అలా రానా - మిహీకాల ఫ్యామిలీల మధ్య పెళ్ళి కూడా చేసేసుకున్నారు. వీరి వివాహం ముందు స్టేటస్ కు తగ్గట్టే ఫలక్‌నుమా ప్యాలెస్ లో కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో జరపనున్నట్టు ప్రచారం జరిగినా చివరికి రామానాయుడు స్టూడియోలో చేశారు. అయితే పెళ్ళికి 50 మంది మాత్రమే హాజరు కావడానికే ఛాన్స్ ఉండడంతో చాలా తక్కువ మంది హాజరరయ్యారు. 

తెలుగు, మార్వాడీ సాంప్రదాయాల్లో  ఈ పెళ్లి నిర్వహించారు. దృష్ట్యా పెళ్లికి రాలేని ఇండస్ట్రీలోని ఇతర సెలబ్రిటీలు..ఫ్రెండ్స్ కోసం నటుడు రానా వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ పెళ్లి  ఈ టెక్నాల‌జీలో ఉప‌యోగించాల్సిన సామాగ్రిని కూడా రానా త‌ను ఎవ‌రినైతే పిల‌వాల‌ని అనుకున్నారో వారికి పంపార‌ట‌. ఇప్పుడు రానా పెళ్ళికి రాని అందరు సినీ పెద్దలు, సెలబ్రిటీలకి దగ్గుబాటి సురేష్ బాబు ఒక గిఫ్ట్ ప్యాక్ రెడీ చేసి పంపారట. దానితో పాటు స్పెషల్ నోట్ లో రానా మరియు మిహికాల యువ జంటను ఆశీర్వదించమని కోరారట. ఎంతయినా పెద్ద వాళ్ళ పెళ్లి ఇలా జరిగిపోతే ఆ మాత్రం అయినా చేయోద్దా ?

More Related Stories