English   

వర్మ బయోపిక్‌కు అంతా సిద్ధం.. ఆర్జీవీ నిర్మాణంలోనే..

RGV
2020-08-25 21:05:55

ఇంతకంటే వెరైటీ మరోటి ఉండదు. తనపై వాడు వీడు సినిమాలు చేయడం ఏంటి.. తనే చేసుకుంటాను అంటున్నాడు వర్మ. ఎప్పటికప్పుడు తనపై తాను సెటైర్ వేసుకోడానికి కూడా వెనకాడడు వర్మ. పక్క వాన్ని తిట్టాలంటే ముందు తనను తాను తిట్టుకుంటాడు. అప్పట్లో వచ్చిన అప్పల్రాజు సినిమాలో కూడా ఇదే చేసాడు ఆర్జీవీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఇప్పటికే వర్మపై పరాన్న జీవితో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన బయోపిక్ తానే నిర్మించడానికి ముందుకొచ్చాడు ఆర్జీవీ. బొమ్మాకు మురళి నిర్మాణంలో  RGV పర్యవేక్షణలో   దొరసాయి తేజ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు కానుంది. ఒక్కో పార్టు రెండు గంటల నిడివితో మొత్తం మూడు భాగాలుగా రానుంది వర్మ బయోపిక్. వివిధ దశల్లోని మొదటి రెండు భాగాల్లో రాము క్యారెక్టర్‌ను ఇతర నటులు పోషించనుండగా.. కీలకమైన మూడో భాగంలో స్వయంగా రామ్ గోపాల్ వర్మ నటించనున్నాడు. మొత్తానికి తన బయోపిక్‌నే తానే నిర్మిస్తూ నటిస్తూ సంచలనాలకు తెర తీస్తున్నాడు ఆర్జీవీ. 

More Related Stories