English   

బోర్ కొడితే పెళ్లి చేసుకుంటాం అంటోన్న నయన్ బాయ్ ఫ్రెండ్

 Vignesh Shivan
2020-08-26 12:16:28

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు అంతా సిద్దంగా ఉన్నా నయనతార పెళ్లి గురించిన వార్త ఒకటి వారం నుండి హల్చల్ చేస్తోంది. . 2004లో ‘చంద్రముఖి’ సినిమాతో.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన.. ఆమె.. దాదాపు 15 సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా కనిపిస్తూనే ఉంది. మొదట శింబు, తర్వాత ప్రభుదేవ, ఇప్పుడు విఘ్నేష్.. ఇదీ నయనతార మీడియాకు ఉప్పందించిన కాబోయే మొగుళ్ళ లిస్ట్. పీటల దాకా వస్తోన్న ఆమె పెళ్లిళ్లు మాత్రం జరగడం లేదు. ఇప్పుడు కూడా విఘ్నేష్‌తో పెళ్లి జరుగుతుందా..? అంటూ అందరిలోనూ ఓ ప్రశ్న మొదలయ్యింది. మొదట శింబు విషయంలో పెళ్లి కన్ఫార్మ్ అయి ఇక మూడు ముళ్లు పడడమే ఆలస్యం అనుకున్న సమయంలో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుదేవా విషయంలో కూడా అంతే ఇప్పుడు విజ్ఞేశ్ వంతు. అయితే అసలు వీరికి పెళ్లి అవుతుందా అని ఎవరో అడిగిన ప్రశ్నకు విఘ్నేశ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. 

ప్రస్తుతం మేమిద్దరం డేటింగ్ లో ఎంజాయ్ చేస్తున్నామని ఈ రిలేషన్ బాగుందని దీని మీద బోర్ కొట్టినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తామని చెప్పుకొచ్చారు. విఘ్నేశ్ మాటలను బట్టి చూస్తే వీరి పెళ్లి ఇప్పట్లో జరగదని ఫీలయిపోతున్నారు ఆమె అభిమానులు. వీరిద్దరి ప్రేమ 2015లో మొదలైంది. నానుమ్ రౌడీ ధాన్.. అనే తమిళ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఆ సినిమా సమయంలో ఏర్పడిన ప్రేమ వీరిద్దరి ఘాడంగా అల్లుకుపోయింది.

More Related Stories