English   

ఎలుకలు బయటకొస్తున్నాయి.. అందుకే ట్రేండింగ్ 

Kangana
2020-08-26 12:23:21

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సుశాంత్ ఆత్మహత్య సందర్భంగా మళ్ళీ యాక్టివ్ అయింది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఉన్న నెపోటిజమే కారణమని ఆమె బల్లగుద్ది చెబుతోంది. ఆమె ఆ మధ్య తన ఇన్స్టా గ్రామ్ ఒక వర్గం జర్నలిస్టులను ఇంటలేక్చువల్స్ గా అభివర్ణిస్తూ సుశాంత్ మీద రాసిన నెగటివ్ ఆర్టికల్స్ ని చదివి వినిపించింది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో బాయ్ కాట్ కంగనా హ్యాస్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటంతో కంగనా స్పందించింది. అద్భుతం. ఎలుకలు ఇప్పుడు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయి. బాయ్‌కాట్ కంగన హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉందని పేర్కొంది. బాలీవుడ్ మాఫియా తను చేయగలిగింది చేయడానికి ప్రయత్నిస్తోందన్న కంగన తన ట్విటర్ ఖాతాను కూడా నిలిపివేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది జరిగే లోపే కొందరి వ్యవహరాలను బయటపెడతానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక నిన్న కూడా నిందితులను అరెస్టు చేసే అధికారం భారత న్యాయవ్యవస్థకు ఉందో లేదో చూద్దాం అని కాసేపటి క్రితం కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. బాలీవుడ్ లోని ప్రముఖులే ఈ హత్య చేసి ఉండవచ్చు అన్నట్టు ఆమె తన ట్వీట్ లో పేర్కొంది.

More Related Stories