English   

ప్రశాంత్ నీల్ తో ఆ ముగ్గురి సినిమాలు 

Prashanth Neel
2020-08-26 12:28:11

ఆ సినిమా ముందు వరకూ ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. ఏ ముహూర్తాన అయితే కేజీఎఫ్ ను రిలీజ్ చేసారో ఆనాటి నుండి యష్ తో పాటు ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ పేరు కూడా గట్టిగానే వినపడింది. అయితే సడన్ గా ఈయన తెలుగు సినిమా దర్శకత్వం వహిస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరగగా ఆ విషయం మీద క్లారిటీ కూడా ఒచ్చేసింది. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ అదే ట్వీట్లో ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీంతో ఒకరకంగా ఎన్టీఆర్ అభిమానులు గాల్లో తేలిపోయారు. మొత్తానికి నూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. నెక్ట్స్ టైమ్ ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ చుట్టూ నా రేడియేషన్ సూట్ ని వెసుకొస్తాను పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొనడంతో ఆ సినిమా కన్ఫాం అయినట్టె. 

మైత్రీ మూవీ మేకర్స్ కూడా ప్రశాంత్ తో ఒప్పందం చేసుకుందని ఆ నిర్మాతల్లో ఒకరు ప్రకటించడంతో అది ఖరారు అయినట్టే. అయితే ఈయన ఎన్టీఆర్ సినిమా కంటే ముందే డార్లింగ్ ప్రభాస్ కి ప్రశాంత్ ఓ స్టోరీ చెప్పాడని అప్పట్లో చర్చల స్టేజ్ లో ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ మొదలుకానుందని అంటున్నారు. అది కాక రామ్ చరణ్ కూడా నెక్స్ట్ సినిమా 'కేజీఎఫ్' డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడనే టాక్ మొదలైంది. అలా మొత్తానికి కుర్ర హీరోలలో టాప్ ఉన్న వీరంతా ప్రశాంత్ నీల్ తో సినిమా అనేట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ కాగా మిగతా వాళ్ళ సినిమాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.   

More Related Stories