English   

నాని వి ట్రైలర్ టాక్.. ఎక్సపెక్టేషన్స్ అందుకుంది

Nani V Movie
2020-08-27 09:18:07

నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న  ''వి'' మూవీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆఫీసియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఫైట్స్.. చేజింగ్ సీన్స్ చూస్తుంటే ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇక సుధీర్ బాబు విలన్ కోసం వేట కొనసాగించే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఓ సైకో కిల్లర్ - సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు మధ్య ఛాలెంజింగ్ గా సాగే సినిమా కూడా తెలుస్తోంది. ఈ ట్రైలర్ లో ఆదితిరావు పాత్రను రివీల్ చేయలేదు. మొత్తం మీద ట్రైలర్ 'మళ్ళీ ఎక్సపెక్టేషన్స్ కి మ్యాచ్ కాలేదనే మాట రాకూడదు' రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.వాస్తవానికి 'వి' సినిమాని ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో 'వి' విడుదల వాయిదా పడింది. 

More Related Stories